చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు నిర్మాతగా ఏ ఏం రత్నం వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా స్టార్ట్ అయింది. దానితో పవన్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటాడు అని ఆయన అభిమానులు ఆశించారు. ఈ మూవీ స్టార్ట్ అయ్యి కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వేరే సినిమాలపై ఫోకస్ పెట్టడం , ఆ తర్వాత రాజకీయాలపై దృష్టి పెట్టడంతో , ఈ సినిమా డిలే అయింది.

అలాగే ఈ మూవీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి "కొండపొలం" అనే సినిమాను ఆ గ్యాప్లో రూపొందించాడు. ఇలా ఈ సినిమా చాలా డిలే అవుతూ వచ్చింది. దానితో క్రిష్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత జ్యోతి కృష్ణ అనే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన భాగం షూటింగ్ను పూర్తి చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావడంతో ఈ మూవీ ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో అంతా ఓకే అయ్యింది. హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని పవన్ ప్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

అలాంటి సమయంలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి అని , ఈ సినిమాను జూన్ 12 వ తేదీన విడుదల చేయడం లేదు అని , కొత్త తేదీని మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తాం అని మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పటివరకు కూడా హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ను మేకర్స్ ప్రకటించలేదు. దానితో పవన్ అభిమానులు కాస్త త్వరగా హరిహర వీరమల్లు మేకర్స్ విడుదల తేదీని అయినా అనౌన్స్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: