కొన్ని కొన్ని సార్లు సినిమా మొత్తం కన్నా కూడా ఒక పాట మాత్రమే బాగుంటుంది . ఆపాట సినిమాకి పాజిటివ్ టాక్ తీసుకొస్తుంది . ఒక్క పాటలోనే సినిమా కథ మొత్తం వివరించేలా డైరెక్టర్ చేస్తూ ఉంటారు . ప్రజెంట్ శేఖర్ కమ్ముల కూడా అలానే చేశారు . మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న అందరికీ చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ మాత్రం శేఖర్ కమ్ములన్రే. 0% నెగిటివిటీ ..0% హెడ్ వెయిట్ ..0% తో కుల్లు తో ఇండస్ట్రీలో ఆయన ఒక క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నాడు . శేఅఖర్ కమ్ముల తాజాగా తెరకెక్కించిన సినిమా కుబేర .


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటించిన ఈ సినిమా మరికొద్ది గంటలోనే థియేటర్స్ రిలీజ్ కాబోతుంది.  ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్  నెలకొన్నాయి . రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అమాంతం సినిమా పై హైప్స్  పెంచేసింది.  అయితే ఈ సినిమాలో ధనుష్ నుంచి పలు వేరియేషన్స్ ఉన్న క్లిప్స్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా రీసెంట్ గా విడుదల చేసిన అమ్మ పాట చాలా చాలా తక్కువ మందే విని ఉండొచ్చు . కానీ సాంగ్ మాత్రం సినిమాని మలుపు తిప్పబోయే రేంజ్ ఉన్న కంటెంట్ ఉన్న పాట అంటున్నారు మేకర్స్ .



థియేటర్స్ లో ఈ సాంగ్ అదేవిధంగా అందులో ధనుష్ పర్ఫామెన్స్ పీక్స్ లో ఉండేలా చేశాడట శేఖర్ కమ్ముల . దేవిశ్రీప్రసాద్ తన మార్క్ ఎమోషనల్ ఈ పాటలో చూపించారట . అంతేకాదు కుబేర సినిమా హిట్ అవ్వాలి అన్న ఫట్ అవ్వాలి అన్న మొత్తం ఈ పాటలోనే ఉంటుందట . ఈ పాటలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయట . అసలు సినిమా ఏంటి..? సినిమా కథ ఏంటి..? సినిమా కథ ఎలా మలుపు తిరుగుతుంది..? సినిమా కంటెంట్ ఏంటి ..? అనే విషయం మొత్తం ఈ మూడు నిమిషాల పాటల్లోనే శేఖర్ కమ్ముల కళ్ళకు కట్టినట్లు చూపించేస్తారట . మరీ ముఖ్యంగా ధనుష్ ఎమోషనల్ సీన్ మాత్రం సినిమాకి హైలెట్ గా ఉండబోతుందట . ఈ పాట కానీ హిట్ అయితే నో డౌట్ ఇక సినిమా మొత్తం హిట్ అయినట్టే అంటున్నారు మేకర్స్.  కుబేరలో ఈ పాట ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.  జూన్ 20వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో కుబేర సినిమా రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు కంప్లీట్ చేసేసింది చిత్ర బృందం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: