కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు అయినటువంటి మంచు విష్ణు తాజాగా కన్నప్ప అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ , మలయాళ నటుడు మోహన్ లాల్ , టాలీవుడ్ నటుడు మోహన్ బాబు , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని జూన్ 27 వ తేదీన ప్రపంచకవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తుంది. ఈ మూవీ యొక్క సీడెడ్ ఏరియా హక్కులను టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి ఓ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కన్నప్ప మూవీ యొక్క సీడెడ్ థియేటర్ హక్కులను మైత్రి మూవీ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

మైత్రి మూవీ సంస్థ వారు ఈ మూవీ యొక్క సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులను దక్కించుకున్నారు అనే వార్త తెలియడంతో ఈ మూవీ ని సీడెడ్ ఏరియాలో మైత్రి సంస్థ వారు పెద్ద ఎత్తున విడుదల చేయడం పక్క , ఈ మూవీ కి మంచి టాక్ కనక వచ్చినట్లయితే సీడెడ్ ఏరియాలో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు కూడా వస్తాయి అనే అభిప్రాయాలను అనేక మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని సీడెడ్ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: