సినిమా కంటెంట్ దొంగతనాలు అనేవి చాలా సంవత్సరాలుగా జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలోని ఫస్ట్ ఆఫ్ HD ప్రింట్ ను ఎవరో లీక్ చేసేసారు. దానితో ఒక్క సారిగా షాక్ లోకి వెళ్లిన మూవీ యూనిట్ హుటా హుటిన ఆ సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి ఆ మూవీ ని విడుదల చేశారు. ఆ సినిమా ఆ సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో సినిమా కంటెంట్ సన్నివేశాల దొంగతనాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు హీరోగా రూపొందిన కనప్ప సినిమా హార్డ్ డిస్క్ మిస్ అయింది అని ఆ మూవీ యూనిట్ చెప్పుకొచ్చింది. అలాగే అందులో ప్రభాస్ కి సంబంధించిన కీలక సన్నివేశాలు ఉన్నట్లు కూడా మూవీ యూనిట్ పేర్కొంది. ఇక ఆ తర్వాత మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... కన్నప్ప సినిమాకు సంబంధించి దొంగతనం జరిగిన హార్డ్ డిస్క్ ఇంకా దొరకలేదు , కానీ ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న సన్నివేశాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను జూన్ 16 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ విడుదలకు దాదాపు మూడు రోజుల ముందే ఈ మూవీ టీజర్ ఎవరు ఆన్ లైన్ లో లీక్ చేసేసారు.

ఇక తాజాగా ఆ ఈ మూవీ టీజర్ ను లీక్ చేసింది ఎవరో వారిని పట్టుకోవడానికి మూవీ యూనిట్ సన్నద్ధం అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ ఇన్చార్జ్ అయినటువంటి వసంత్ కుమార్ , బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ సినిమా టీజర్ను ఎవరు లీక్ చేసారో వారికి తగిన శిక్ష పడాలి అని ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు వసంత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజా సాబ్ యూనిట్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మూవీ టీజర్ను లీక్ చేసిన వ్యక్తి త్వరలోనే దొరుకుతాడు అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: