
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. మెగా 157లో చిరంజీవితో పాటు మరో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కనిపించబోతున్నారట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వెంకీకి అనిల్ రావిపూడి `ఎఫ్2`, `ఎఫ్3`, `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ ను అందించాడు. ఆ సన్నిహిత్యంతోనే చిరంజీవి చిత్రంలో ఓ స్పెషల్ రోల్ కోసం అనిల్ వెంకీని సంప్రదించగా.. ఆయన వెంటనే ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది.
అలాగే ఈ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యత ఉంటుందని.. త్వరలోనే ఆయన షూటింగ్‌లో కూడా జాయిన్ కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మెగా 157 కోసం వెంకీ దాదాపు నెలరోజుల పాటు కాల్షీట్లు ఇచ్చారట. జూలై నెలాఖరుకు ఆయన క్యారెక్టర్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతుందని.. ఆ వెంటనే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన కొత్త సినిమాను ప్రారంభించనున్నారని టాక్ నడుస్తోంది. ఒకవేళ నిజంగా చిరంజీవి సినిమాలో వెంకటేష్ కనిపిస్తే అటు దగ్గుపాటి, ఇటు మెగా ఫాన్స్ కు కన్నుల పండుగ అని చెప్పుకోవచ్చు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు