
సూపర్ స్టార్ మహేష్ బాబు అద్భుతమైన నటుడని నేను ఎంతో అభిమానించే నటులలో మహేష్ కూడా ఒకరని ఆమె చెప్పుకొచ్చారు. మహేష్ బాబు సూపర్ స్టార్ అయినప్పటికీ తోటి నటులను ఎంతో గౌరవిస్తారని ఆమె పేర్కొన్నారు. చాలామందికి అది చేత కాదని సూపర్ స్టార్ మహేష్ బాబు చాల ప్రొఫెషనల్ అని మహేష్ బాబు హార్డ్ వర్క్ చేస్తారని ఆమె కామెంట్లు చేశారు. నాకేమో షూట్ అయిపోయిన వెంటనే అలసటతో త్వరగా ఇంటికి వెళ్లిపోవాలని అనిపిస్తుందని ఆమె తెలిపారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు వేకువజామున సెట్ కు వఛ్చి రాత్రి 10.30 గంటల వరకు సెట్ లోనే ఉండేవారని అలా ఆయనతో కలిసి పని చేసే సమయంలో గిల్టీగా ఫీలయ్యానని త్రిష చెప్పుకొచ్చారు. మహేష్ బాబు వానిటీ వ్యాన్ దగ్గరకు వెళ్లగా నేనెప్పుడూ చూడలేదని ఆమె చెప్పుకొచ్చారు. తన సీన్ షూట్ చేసే సమయంలో మహేష్ బాబు మానిటర్ దగ్గరే కూర్చునే వారని ఆమె కామెంట్లు చేశారు.
త్రిష చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు. మహేష్ రాజమౌళి కాంబో సినిమాపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపుగా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.