
జొన్నలగడ్డ, అడివి శేష్ వంటి యంగ్ హీరోలతో ఇంటెన్స్ ఉన్న మూవీస్ చేస్తానని.. విజయ్ దేవరకొండ తో మంచి లవ్ స్టోరీ తీస్తానని శేఖర్ కమ్ముల తెలిపారు. అలాగే ఎన్టీఆర్ తో అవకాశం వస్తే రెబల్ ఉండే మూవీ చేస్తానన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాంటిక్ ఫిల్మ్ తీయాలని ఉందని చెప్పి శేఖర్ కమ్ముల ఆశ్చర్యపరిచారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. గతంలో శేఖర్ కమ్ముల, మహేష్ బాబు కాంబోలో ఓ సూపర్ హిట్ మూవీ మిస్ అయింది.
ఇంతకీ ఆ చిత్రం మరేదో కాదు `గోదావరి`. అక్కినేని సుమంత్, కమలిని ముఖర్జీ జంటగా నటించిన ఈ చిత్రం 2006 మే 19న థియేటర్స్ లో విడుదలైన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హీరో-హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, గోదావరి నది, పాపికొండల అందాలు, సాంగ్స్, శేఖర్ మేకింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. గోదావరి అలల్లాగానే ఈ మూవీని కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా తెరకెక్కించడంతో శేఖర్ సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే నిజానికి గోదావరి మూవీని మొదట మహేష్ బాబుతో చేయాలని శేఖర్ కమ్ముల భావించారు. కానీ ఇతర ప్రాజెక్ట్స్ కారణంగా ఆయన రిజెక్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్, గోపీచంద్ వంటి హీరోలను కూడా సంప్రదించారట. ఇక చివరకు సుమంత్ హీరోగా చేసి క్లాస్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.