ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాకు థియేట్రికల్ బిజినెస్ తో పాటు నాన్-థియేట్రికల్ బిజినెస్ కూడా కీలక ఆదాయంగా మారింది. ముఖ్యంగా కరోనా తరువాత ఓటీటీ అనేది సినిమా ఆదాయంలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. కొన్ని సినిమాలైతే ఓటీటీ, శాటిలైట్ హక్కులు, మ్యూజిక్ డబ్బింగ్ లాంటి నాన్-థియేట్రికల్ బిజినెస్ రూపంలోనే ఆదాయం పొందుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్, ఇమేజ్ పై కూడా పడింది.


ఇన్నాళ్లు థియేట్రికల్ మార్కెట్, ఫ్యాన్ బేస్‌ ఆధారంగా హీరోల రెమ్యున‌రేష‌న్‌, ఇమేజ్ ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు నాన్-థియేటర్ మార్కెట్ ను లెక్కలోకి తీసుకుంటున్నారు . తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దిల్ రాజు నిర్మాణంలో నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `తమ్ముడు`. జూలై 4న‌ ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.


అయితే ఈ చిత్రానికి నితిన్ రెమ్యున‌రేష‌న్ లో కోత వేసిన‌ట్లు దిల్ రాజు స్వ‌యంగా పేర్కొన్నారు. అందుకు కారణం నాన్‌-థియేట్రిక‌ల్‌ బిజినెస్ పడిపోవడమే అని ఆయన క్లియర్ క‌ట్ చెప్పేశారు. దిల్ రాజు వ్యాఖ్య‌లు ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టాయి. ఈ ప‌రిస్థితుల్లో ఒక హీరోకు థియేట్రిక‌ల్ హిట్స్‌, భారీ ఒపెనింగ్స్ ఉంటే స‌రిపోదు.. అతని సినిమాలకు ఓటీటీ, టీవీ, ఇతర భాషల్లో ఎంత డిమాండ్ ఉందో ప‌రిగ‌ణించి రెమ్యున‌రేష‌న్ ను డిసైడ్ చేస్తారు నిర్మాత‌లు. ఇది ఒక ర‌కంగా టాలీవుడ్ హీరోల‌కు వేక‌ప్ కాల్ లాంటిది. ప్ర‌స్తుత ప‌రిస్థితిని  లోతుగా అర్ధం చేసుకొని దానికి తగ్గట్టు సినిమాల కంటెంట్ ని ప్లాన్ చేసుకోవాల్సిన అవ‌స‌రం హీరోల‌కు ఎంతైనా ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: