
కన్నప్ప: సినిమా చూడడానికి వెళ్లే ప్రతి ఒక్కరు అది తీసుకెళ్లాల్సిందే.. ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!

అంతే కాదు ప్రభాస్ ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అన్న విషయాన్ని చిత్ర బృందం బయటపెట్టింది . దీంతో ఫ్రెండ్షిప్ కి ప్రభాస్ ఎంత వాల్యూ ఇస్తాడు అనే విషయం కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. కాగా కన్నప్ప సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా కొంతమంది సినిమా సూపర్ డూపర్ హిట్ అంటుంటే మరి కొంతమంది సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు . కొంతమంది ఫస్ట్ ఆఫ్ బోరింగ్ గా ఉంది అని.. సెకండ్ ఆఫ్ ప్రభాస్ వచ్చాక వేరే లెవెల్ కి సినిమా వెళ్ళిపోతుంది అని .. మోహన్ లాల్ పాత్ర చాలా సర్ప్రైజింగ్ గా ప్లాన్ చేశాడు అని.. ఖచ్చితంగా ఈ పాత్ర మలయాళి అభిమానులను ఆకట్టుకుంటుంది అని చెప్పుకొస్తున్నారు.
అంతేకాదు క్లైమాక్స్ చాలా చాలా అద్భుతంగా ఉందని .. ప్రతి ఒక్క అభిమానిని ఎమోషనల్ కి గురి చేసే విధంగా క్లైమాక్స్ కంటతడి పెట్టించే రేంజ్ లో ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు కనప్ప నిజంగా ఒక విజువల్ వండర్ అని కూడా జనాలు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా చూడడానికి వెళ్లే వాళ్ళు కచ్చితంగా సరే పేపర్ ముక్కలు తీసుకెళ్లండి అని.. ప్రభాస్ ఎంట్రీ సీన్ కి అరుపులు కేకలతో పేపర్లు వేస్తూ విజిల్స్ వేస్తే ఆ కిక్కే వేర్య్ అని రెబెల్ అభిమానులు ఓ రేంజ్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ పై మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి కన్నప్ప సినిమా హిట్ అవ్వడానికి కర్త - కర్మ - క్రియ అంతా కూడా ప ప్రభాసే అని చెప్పుకోవడంలో సందేహమే లేదు అంటూ రెబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదిక ప్రభాస్ ని పొగిడేస్తున్నారు..!