గత కొన్ని నెలలుగా మంచు విష్ణు మంచు మనోజ్ ల మధ్య ఏర్పడ్డ విభేధాలకు సంబంధించిన వార్తలు మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల మధ్య అన్నదమ్ముల మధ్య ఏర్పడ్డ గ్యాప్ ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుంది అంటూ మంచు మనోజ్ కుటుంబం సన్నిహితులు బాధపడుతున్నట్లు కూడ వార్తలువచ్చాయి.


ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు విడుదలైన ‘కన్నప్ప’ మూవీ ఎవరు ఊహించని విధంగా మంచు బ్రదర్స్ మధ్య రాజీకి మార్గం సుగమం చేసిందా అన్న సందేహాలు చాలమందిలో కలుగుతున్నాయి. ఈరోజు విడుదలైన ‘కన్నప్ప’ మూవీని ఉదయం ఆటను ప్రసాద్ ఐమ్యాక్స్ లో మంచు మనోజ్ చూడటమే కాకుండా ఆమూవీ పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.


ఈ మూవీని చూసి బయటకు వస్తున్న మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ తాను ఊహించిన దానికన్నా వేయి రేట్లు ఈ మూవీ అద్భుతంగా ఉందని ప్రభాస్ ఈ మూవీలోకి ఎంటర్ అయినతరువాత ఈ మూవీ రేంజ్ మరో స్థాయికి చేరిపోయిందని కామెంట్స్ చేశాడు. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా అది తక్కువని అంటూ ఈ మూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నాడు.


ఈ మూవీకి టోటల్ పాజిటివ్ టాక్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడ లభిస్తూ ఉండటంతో  మంచు విష్ణు అంచనాలను నిజం చేస్తూ హిట్ ముద్ర వేయించుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు వస్తున్న కలక్షన్స్ అన్నీ వీకెండ్ తరువాత కూడ నిలబడినప్పుడు మాత్రమే ఈ మూవీకి కాసుల వర్షం కురుస్తుంది. గత వారం విడుదలయి హిట్ టాక్ తెచ్చుకున్న ‘కుబేర’ మొదటి మూడు రోజులు కలక్షన్స్ విషయంలో హడావిడి చేసి ఆతరువాత నాల్గవ రోజు నుండి కలక్షన్స్ విషయంలో అంచనాలను అందుకోలేక పోవడంతో ఏసీనిమా రియల్ హిట్ అన్నది ఎవరు ఊహలకు అందడంలేదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: