
జాన్వికపూర్ తాజాగా ఓ విషాద ఘటన విషయంలో మండిపడుతూ తన కోపాన్ని వ్యక్తం చేసింది . బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకాల మరణం అందరిని షాకింగ్ కి గురి చేసింది . అయితే ఆమెకి జరిగే అంతిమ కార్యక్రమాల విషయంలో కొందరు మీడియా వ్యక్తులు కనుబరిచిన అత్యుత్సాహానికి స్టార్ బాలీవుడ్ సెలబ్రిటీస్ మండిపడ్డారు . మరీ ముఖ్యంగా ప్రముఖ హీరో వరుణ్ ధావన్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇలాంటి విషయాలను మీడియా వ్యక్తులు కవర్ చేయకపోతే బాగుంటుంది .. అసలు ఇది పద్ధతి కాదు అంటూ కూసింత ఘాటుగా చివాట్లు పెట్టారు.
అయితే ఈ స్టేట్మెంట్ కి జాన్వికపూర్ కూడా తన మద్దతు తెలిపింది. చివరికి కనీసం ఒక్కరైనా ఈ విషయంలో నోరు విప్పారు అంటూ సున్నిత అంశం పట్ల వరుణ్ స్టేట్మెంట్తో నిలబడింది . దీంతో జాన్వికపూర్ పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. జాన్వికపూర్ తన కోపాన్ని ఈ విధంగా తెలియజేసింది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు కొంతమంది ఘాటుగా ఛీ ఛీ అసలు మనుషులేనా..? మీడియా ఏంటి ఇలా తయారైంది..?? అంటూ కూసింత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు మాత్రం మీడియా పని మీడియా చేస్తుంది మధ్యలో నీకేంటి అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు . దీంతో వరుణ్ ధావన్ - జానీ కపూర్ ల పేర్లు మీడియాలో వైరల్ అవుతున్నాయ్..!