టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరుపొందిన సమంతకి చెల్లెలు అంటే చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో సమంత చెల్లెలుగా నటించింది.. ఆ చైల్డ్ యాక్టర్ ఎవరో కాదు శ్రీయాశర్మ. మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాలో సమంతకు చెల్లెలి పాత్రలో నటించింది. అయితే అంతకుముందే చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రంలో కూడా చైల్డ్ యాక్టర్ గా నటించి బాగా పేరు సంపాదించింది శ్రీయా శర్మ. ఆ తర్వాత హీరోయిన్ గా శ్రీకాంత్ కొడుకు నటించిన నిర్మల కాన్వెంట్ స్కూల్ అనే చిత్రంలో కూడా నటించింది.


శ్రీయా శర్మ మాత్రం మళ్లీ ఎలాంటి సినిమాలో కనిపించలేదు. తాజాగా ఈ అమ్మడు గురించి ఒక న్యూస్ అయితే వినిపిస్తోంది. ఈ అమ్మడు టాప్ లాయర్ గా ఎదిగిందని ప్రస్తుతం ఈ వయసు 26 సంవత్సరాల అని దేశంలోనే టాప్ కార్పొరేట్ కంపెనీలకు లాయర్గా పనిచేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లాయర్ గా అయినప్పటికీ కూడా హీరోయిన్లకు దీటుగా తన అందాన్ని సొంతం చేసుకున్నట్లు పలు రకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఇక సోషల్ మీడియాలో కూడా 4.5 లక్షల మంది ఫాలోవర్స్ కలిగి ఉన్నారు అప్పుడప్పుడు తన గ్లామర్ తో అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది శ్రీయా శర్మ. ఈ అమ్మడు ఫోటోలు చూసిన అభిమానులు సైతం తిరిగి మళ్లీ సినిమాలలోకి రీ యంట్రి ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కూడా సినిమాలలో నటిస్తూ తమ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. మరి అలాంటి వారి బాటలోనే శ్రీయా శర్మ కూడా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి. మొత్తానికి సమంత చెల్లెలుగా  నటించి అందరినీ ఆకట్టుకుంది శ్రీయా శర్మ.. సమంత కూడా ప్రస్తుతం అడపా దడపా చిత్రాలలో నటిస్తూ ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: