జయపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే టాలీవుడ్ హీరోల్లో అల్లరి నరేష్ ఒకరు. తాజాగా ఈయన `ఆల్కహాల్` అనే ఆసక్తికరమైన టైటిల్ తో మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. `ఫ్యామిలీ డ్రామా` ఫేమ్ మెహర్ తేజ్ డైరెక్ట్‌ చేయనున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్.. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.


తాజాగా బయటకు వచ్చిన‌ టైటిల్ అండ్ అల్లరోడి ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. అయితే ఈ చిత్రంలో అల్లరి నరేష్ కు జోడిగా ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరదలు యాక్ట్ చేయబోతోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. రోహాని శర్మ. టాలీవుడ్ క్లాసిక్ `చిలసౌ` సినిమాతో కథానాయకగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రుహాని శర్మ.. తొలి ప్రయత్నం లోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ సరైన ఫలితాలు అందుకోలేకపోయింది.
సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం రోహాని శర్మకు భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు గ్లామ‌ర‌స్‌ ఫోటోలతో నెట్టింట మంటలు రేపే రోహాని శర్మ.. బాలీవుడ్ అగ్ర తార అనుష్క శర్మకు కజిన్. అనుష్క విరాట్ ను పెళ్లాడడంతో రోహాని అతనికి మరదలు అయింది. ఇకపోతే తాజాగా రోహాని శర్మ ఆల్క‌హాల్‌ చిత్రంలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. త్వరలోనే ఆమె షూటింగ్‌లో కూడా జాయిన్ కాబోతోంది. దీంతో అల్లరి నరేష్, రుహాని శర్మ జోడి అదుర్స్ అని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: