
కానీ తెర ముందుకు వస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఆయన కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా చూపించాడు. రీసెంట్ గా శిరిష్ వచ్చిన ఇంటర్వ్యూలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ పై క్లారిటీ ఇచ్చేశారు . మరి ముఖ్యంగా థియేటర్స్ అదేవిధంగా థియేటర్స్ కోసం స్టార్ హీరోస్ ఏ విధంగా పోటీపడతారు ..? సంక్రాంతి సీజన్స్ లో డబ్బింగ్ సినిమాలకి ఎటువంటి ప్రయారిటీ ఉంటుంది..? తెలుగు సినిమాలకు ఎటువంటి ప్రయారిటీ ఉంటుంది..? ప్రొడ్యూసర్స్ - డిస్ట్రిబ్యూటర్స్ - మేకర్స్ ఎలా ఆలోచిస్తారు..? ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాలపై నోరు విప్పి మాట్లాడారు శిరీష్ .
మరీ ముఖ్యంగా "సినిమా ఇండస్ట్రీ అంటే ఒక వ్యాపారం అని ..ఇక్కడ వ్యాపారం చేసుకునే ఎక్కువగా ఉండారు అని.. నువ్వు నన్ను తొక్కేయాలంటే నేను నిన్ను డబల్ స్థాయిలో తొక్కలనే రీతిలోనే ఆలోచిస్తూ ఉంటారు "అని చెప్పుకొచ్చారు. శిరీష్ మాట్లాడుతూ .."నేను ఎవరిని మోసం చేయను.. నన్ను మోసం చేయాలని చూస్తే ఊరుకోను.. నన్ను లాగనంత అవ్రకు నేను సైలెంట్ గానే ఉంటా నాతో పోటీకి వస్తే మాత్రం ఎంతకైనా దిగుతా అంటూ ఆచార్య సినిమా విషయంలో ఆయన తీసుకున్న డెసిషన్ను వివరించారు".
అంతేకాదు ప్రొడ్యూసర్స్ అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ మధ్య వచ్చే కాంపిటీషన్ గురించి వాళ్ళు మాట్లాడే పద్ధతుల గురించి కూడా క్లారిటీగా వివరించారు . "సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకునే హీరో సేఫ్ గానే ఉంటాడు. సినిమాని డైరెక్ట్ చేసే దర్శకుడు సేఫ్ గానే ఉంటాడు. సినిమాకి డబ్బులు పెట్టిన నిర్మాత ..అలాగే డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సేఫ్ అయిపోతారు.. ప్రాబ్లం అంత సినిమా కొనుక్కున్న వాళ్ళదే.. మేము బతకాలిగా .. మేము మనుషులమేగా.. మాకు పెళ్ళాం పిల్లలు ఉన్నారుగా .. మీరు ఒక్కరే సేఫ్ జోన్ లోకి వెళ్తే సరిపోతుందా..?? మా గురించి కూడా ఆలోచించాలిగా అంటూ ఒక సామాన్యుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచిస్తూ మాట్లాడాడు" శిరీష్ .
అంతేకాదు కొంతమంది స్టార్స్ సినిమా ఫ్లాప్ అయితే అసలు పట్టించుకోరు అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించడం హైలైట్ గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ పై కూడా మాట్లాడాడు . గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయ్యాక రామ్ చరణ్ , శంకర్ ఒక్క ఫోన్ కూడా చేయలేదు అని మేము ఎలా ఉన్నాము..? పరిస్థితి ఏంటి..? అని కూడా పట్టించుకోలేదు అని.. దాని గురించి మేము పెద్దగా పట్టించుకోమని సినిమా ఫ్లాప్ అయితే హీరోలను రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వండి అనే స్థాయికి ఇంకా శ్రీ వెంకటేశ్వర దిగజారిపోలేదు అని.. చెప్పుకొచ్చారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయిన.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ చేశారు .. ఆ సినిమానే మాకు ఊపిరి పోసింది అంటూ శిరిష్ మాట్లాడిన మాటలు చాలా చాలా హైలెట్గా మారాయి. ప్రెసెంట్ ఈ వీడియోని అందరూ ట్రెండ్ చేస్తున్నారు. ఈ వీడియో బాగా వైరల్ గా మారింది..!!