వ‌ర్ష బొల్ల‌మ్మ.. ఈ బెంగ‌ళూరు బ్యూటీని కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌కు కూడా వ‌ర్ష సుప‌రిచితురాలే. 2015లో తమిళ ఇండస్ట్రీలో నటిగా కెరీర్ ప్రారంభించిన వర్ష.. ఆ తర్వాత కాలంలో ఇతర భాషల్లోకి కూడా ప్రవేశించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా బలమైన సహాయక పాత్రల‌ను కూడా పోషిస్తూ ప్రేక్షకులకు చేరువైంది. `చూసీ చూడంగానే` సినిమాతో 2020లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వర్షకు `మిడిల్ క్లాస్ మెలోడీస్` మూవీ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.


తాజాగా ఈ అమ్మడు `తమ్ముడు` మూవీతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. నేడు విడుదలైన తమ్ముడు మూవీకి మిక్స్డ్ రెస్పాన్స్ లభిస్తుంది. కొందరు సినిమా బాగుందని చెబుతుండగా.. మరి కొందరు యావరేజ్ అంటూ సోషల్ మీడియా ద్వారా త‌మ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. తమ్ముడు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన వర్ష తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఆమె ఎన్నో విషయాలను పంచుకుంది.


తమ్ముడు స్టోరీ విన్నప్పుడు తాను పోషించిన చిత్ర క్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించిందని, సవాలుగా తీసుకుని ఈ మూవీ చేసానని వర్ష బొల్లమ్మ తెలిపింది. అక్కాతమ్ముడు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే త‌మ్ముడు చిత్రంలో నితిన్ చేసిన జే క్యారెక్టర్ కు చిత్ర పాత్ర ఓ డ్రైవింగ్ ఫోర్స్ లా ఉంటుందని వ‌ర్ష పేర్కొంది. తమ్ముడు మూవీ కోసం తాను మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నానని తెలియజేసింది. ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో తన మనసులో ఉన్న ఓ వింత కోరికను వర్షం బయట పెట్టింది. ఆన్ స్క్రీన్ పై ఒక్కసారి అయినా సైకో కిల్లర్ క్యారెక్టర్ చేయాలని ఉందని చెప్పి వర్ష షాక్ ఇచ్చింది. ఆమె కామెంట్స్‌ వైరల్ గా మారడంతో.. వర్ష ఇంత వైల్డ్ గా ఉందేంట్రా బాబు అంటూ నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: