టాలీవుడ్ క్రేజీ హీరోలను ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఆఖరుగా విజయ్ "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ప్రస్తుతం విజయ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను మరి కొంత కాలం లోనే విడుదల చేయనున్నారు.

మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే విజయ్మూవీ తో పాటు టాక్సీవాలా , శ్యామ్ సింగరాయ్ మూవీలతో మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్న  రాహుల్ సంక్రుత్తియాన్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు రూపొందించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా 1854 నుంచి 1878 కాలం మధ్యలో కొనసాగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ కోర మీసాలు పెంచుకొని సూపర్ సాలిడ్ లుక్ లోకి వచ్చాడు. ఈ మూవీ కోసమే విజయ్ తన లుక్ మొత్తాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.

మూవీ షూటింగ్ను కూడా మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ కోసం ప్రస్తుతం ఈ మూవీ బృందం రెండు కోట్ల భారీ బడ్జెట్ తో హైదరాబాద్ శివారులో ఓ భారీ సెట్ ను వేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో పాటు విజయ్ , రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే సినిమాలో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd