ఈ రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ డైరెక్టర్ల క్రియేటివిటీపై కొంత నెగిటివిటీ నెలకొన్న విషయం తెలిసిందే .. రీమేక్‌ల‌పై ఆధారపడుతున్న బాలీవుడ్ కి సక్సెస్ దూరం అవటంతో సినీ దిగజాల్లో మేథోమ‌థ‌నం మొదలైంది .  ఇందులో ప్రధానంగా దర్శుకుల వైపే అన్నివేళ్లు చూపిస్తున్నాయి .. దర్శకులు రచయితలు సరైన కంటెంట్‌నీ క్రియేట్ చేయలేకపోవడం వల్ల అసలు సమస్య వస్తుందని చాలామంది బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.  ఇక ఇలాంటి సమయంలో ఒక సౌత్ అగ్ర దర్శకుడు సినిమా , ఒక నార్త్ అగ్ర దర్శకుడు సినిమాతో పోటీ పడబోతుంది .. ఇక ఇది హీరోలను మించి ఆ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్లపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది . లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్లో వస్తున్న కూలి, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న వార్ 2సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగ‌నున్నాయి .. ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్ అవుతుంది ? అన్నదానపై ఎంతో ఆసక్తి నెలకొంది .


కూలీ సినిమాలో రజనీకాంత్ , నాగార్జున లాంటి అగ్ర హీరోలు నటించిన కానీ దర్శకుడు లోకేష్ పనితనం గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది .. లోకేష్ ఇప్పటికే స్క్రీన్ ప్లే మాస్టర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు .. గ్రింప్పింగ్‌ స్క్రీన్ ప్లేను మలచడంలో సీట్ ఏడ్జ్‌ థ్రిల్లర్ల‌ను రూపొందించడంలో స్పెషలిస్ట్ అన్న ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు .. ఇదే సమయంలో హృతిక్ , ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలతో వార్ 2 తెరకెక్కిస్తున్న అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రం లాంటి కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా తీశాడు .. రొటీన్ స్టాఫ్ తో చాలా విమర్శలు తెచ్చుకున్నాడు .. అయితే అతను ఎక్కువగా మీడియాలో ఫోకస్ అవుతుండడంతో భారీ క్యాస్టింగ్ సినిమాతో ఏ మేరకు పనితనం చూపిస్తాడు ? అన్నది ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది .



కూలి వర్సెస్ వార్‌ 2 బాక్సాఫీస్ వార్‌లో గెలిచేది ఎవరు ? అన్నది ఇప్పుడు ప్రధాన చర్చ .. ఈ రెండు సినిమాలు భారీ క్రేజ్ తో ఆగస్టులో ఓకే తేదీకి రిలీజ్ కు రాబోతున్నాయి .. ఇక దీంతో ఒక సౌత్ డైరెక్టర్ కి, ఒక నార్త్‌ డైరెక్టర్ కి మధ్య పోటీ మాత్రమే నన్న చర్చకు తెర లేపారు .. లోకేష్ కనగ‌రాజ్ గొప్ప? అయాన్ ముఖర్జీ గొప్ప అన్నది తెలియాల్సి ఉంది .. అసలు సౌత్ లో క్రియేటివిటీ ఉందా ? నార్త్ లో ఉందా ? అనేది కూడా తేలే సమయం వచ్చేసింది .. ఆగస్ట్ 14న సినిమాలు రిలీజ్ తర్వాత ఎవరి సత్తా ఏంటి అనేది బయటికి వస్తుందా రాదా అనేది చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: