సూర్య.. తమిళ స్టార్ హీరోనే అయిన కూడా తెలుగులోనూ భారీ ఫ్యాన్ బే‌స్ సంపాదించుకున్నాడు. కథల ఎంపికలు చాలా సెలెక్టివ్ గా ఉండే సూర్య.. ఏమైందో ఏమో ఈ మధ్యకాలంలో వరుస పరాజయాలను మూట గట్టుకుంటున్నాడు. `సూరరై పోట్రు`, `జై భీమ్` చిత్రాల తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్స్ ఆయ‌న ఖాతాలో పడలేదు. గత ఏడాది `కంగువ`, రీసెంట్ గా `రెట్రో` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న సూర్య.. ప్రస్తుతం `కరుప్పు` అనే మూవీ చేస్తున్నాడు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌.


అలాగే మ‌రోవైపు `సూర్య 46` వ‌ర్కింగ్ టైటిల్ తో తెలుగు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితో ఓ మూవీని సూర్య ప్రారంభించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ మమిత బైజు హీరోయిన్ గా ఎంపిక అయింది. ఇటీవ‌లె ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీద‌కు వెళ్లింది. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సినీ తార‌ల‌కు కూడా సామాన్యుల మాదిరిగానే ఫేవ‌రెట్ హీరో, హీరోయిన్ ఉంటారు.


మ‌రి సూర్య ఫేవ‌రెట్ యాక్ట్ర‌స్ ఎవ‌రో తెలుసా.. ఆయ‌న భార్య జ్యోతిక అయితే కాదండోయ్. సూర్య ఫ‌స్ట్ క్ర‌ష్ మ‌రియు ఫేవ‌రెట్ హీరోయిన్ ఒక్క‌రే.. ఆమె మ‌రెవ‌రో కాదు సీనియర్ న‌టి గౌతమి. అవును, గౌత‌మి అంటే సూర్య‌కు పిచ్చ ఇష్ట‌మ‌ట‌. ఆమెను సూర్య ఎంత‌గానో ఆరాధించేవార‌ట‌. గ‌తంలో ఓ టాక్ షోలో సూర్య ఈ విష‌యాన్ని స్వ‌యంగా రివీల్ చేయ‌డంతో.. పాపం జ్యోతిక కుళ్లుకుంటుందేమో సార్‌ అంటూ సినీ ప్రియులు స‌రదాగా ఆట‌ప‌ట్టించారు.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: