ప్రస్తుతం కోలీవుడ్ మీడియా మొత్తం నయనతార విడాకుల గురించే మాట్లాడుకుంటుంది. నయనతార విడాకుల మీద అలాంటి పోస్ట్ ఎందుకు పెట్టింది..మళ్ళీ ఎందుకు డిలీట్ చేసింది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు.. అయితే ఈ పోస్ట్ నెట్టింట్లో ఇన్ని గంటల నుండి వైరల్ అయినా కూడా అటు విగ్నేష్ శివన్ కానీ  ఇటు నయనతార గానీ క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక మరికొంత మందేమో అది ఫేక్ పోస్ట్ అని ఆ ఫేక్ పోస్ట్ పై నయనతార స్పందించాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నారు. అయితే నయనతార విడాకుల పోస్ట్  పెట్టడానికి కారణం ఆ కొరియోగ్రాఫర్ అని తాజాగా ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.మరి ఇంతకీ ఆ కొరియోగ్రాఫర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార విగ్నేష్ శివన్ లు ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాని చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా తాజాగా జానీ మాస్టర్ ని తీసుకున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఎప్పుడైతే జానీ మాస్టర్ పేరుని ప్రకటించారో అప్పటినుండి కోలీవుడ్లో పెద్ద ఎత్తున నయనతార దంపతులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.ఇక చిన్మయి అయితే డైరెక్ట్ గానే ఇలాంటి నేరస్తులని సినిమాల కోసం ఎందుకు తీసుకుంటారో అంటూ మాట్లాడింది. అయితే కోలీవుడ్ మీడియా మొత్తం నయనతార దంపతులపై విమర్శలు గుప్పిస్తున్న వేళ నయనతార అలాంటి పోస్ట్ పెట్టడం సంచలనాలకు దారి తీసింది.అయితే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా కోసం జానీ మాస్టర్ ని విగ్నేష్ శివనే తీసుకున్నారట. నయనతార ఇందులో జోక్యం చేసుకోలేదని తెలుస్తుంది.

ఇక తమ మీద వచ్చిన నెగిటివిటీని దృష్టిలో పెట్టుకొని జానీ మాస్టర్ ని తీసేసి వేరే ఎవరినైనా పెట్టుకో అని విజ్ఞేష్ శివన్ కి చెప్పగా ఆయన సైలెంట్ అయ్యారట. అయితే ఈ ఉద్దేశంతోనే నయనతార తన సోషల్ మీడియా ఖాతాలో ఒక మూర్ఖుడైన భర్తని పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు.అలాగే భర్త చేసిన తప్పుకి భార్యది బాధ్యత కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ పోస్ట్ పెట్టింది.ఈ పోస్ట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయం గురించేనని జానీ ని వద్దని విగ్నేష్ శివన్ కి చెప్పగా ఆయన ఒప్పుకోకపోవడంతో సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ ని దృష్టిలో పెట్టుకొని భర్త చేసిన తప్పుకు భార్యని ఎందుకు నిందించడం నన్ను ఒంటరిగా వదిలేయండి అని పోస్ట్ పెట్టింది అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు  మరి ఈ వైరల్ అవుతున్న రూమర్స్ లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: