
అమీర్ ఖాన్ గోల్డెన్ వాచ్, గోల్డెన్ ఫ్రేమ్ గ్లాసెస్ ని ధరించి సిగరెట్ తాగుతూ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. అమీర్ ఖాన్ చాలా స్టైలిష్ అండ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే కూలి సినిమాలో అమీర్ ఖాన్ కూడా ఒక రకమైన విలన్ పాత్రలో నటిస్తున్నారేమో అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సినిమా చివరిలో అమీర్ ఖాన్ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కమలహాసన్ నటించిన విక్రమ్ చిత్రంలో హీరో సూర్య రోలెక్స్ పాత్రలో అద్భుతంగా నటించారు
అలాంటి తరహా పాత్రలోనే ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా నటించబోతున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అమీర్ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు కనిపిస్తోంది. లేకపోతే ఏదైనా హీరోకి సంబంధించి కీలకమైన పాత్రలలో సహాయం చేసే పాత్ర ఏదైనా నటిస్తున్నారా అన్న విషయం తెలియాలి. సన్ పిక్చర్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో ఏ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే నటీనటులకు సంబంధించి పోస్టర్ విడుదల కాగా.. మరి టీజర్ కోసం అభిమానులు ఎక్సైటింగ్ గా ఎదురు చేస్తున్నారు.