బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న సైఫ్ అలీ ఖాన్ కు మధ్యప్రదేశ్  హై కోర్టు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది.  మధ్యప్రదేశ్ లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనామి ప్రాపర్టీగా పేర్కొనలని ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సైఫ్ అలీఖాన్ వేసిన పిటిషన్ ని న్యాయస్థానం కొట్టి పడేసింది . ఆయన కుటుంబానికి సంబంధించిన 15000 కోట్ల ఆస్తులను ఎనామి ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  దీనితో సైఫ్ అలీఖాన్ కి ఇది బిగ్ షాక్ అంటున్నారు ప్రముఖులు .


సైఫ్ అలీ ఖాన్ మరియు అతని కుటుంబ సభ్యులు తమ పూర్వీకుల ఆస్తులకు వారసులుగా గుర్తించాలని కోరుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. భోపాల్ లో సైఫ్ కుటుంబాన్నికి అతని నానమ్మ సుల్తానా నుంచి పలు విలాసవంతమైన భవంతులు వారసత్వంగా వచ్చాయి. ఇవి చాలా ఖరిదు అయిన ప్రాపర్టీలు.  భోపాల్ చివరి నవాబు హమీదుల్లా కుమార్తె సాజిద . ఆయన పెద్ద కుమార్తె అబీద సుల్తాన్ దేశ విభజన నేపథ్యంలో 1950లో పాకిస్తాన్ కి వలస వెళ్లారు . కాగా సాజీద ఇక్కడ నివసిస్తూ పటోల నవాబు అయిన ఈఫ్తీ కర్ అలీ ఖాన్ అంటే సైఫ్ అలీ ఖాన్ తాతను పెళ్లి చేసుకున్నారు .



ఆ సమయంలో సజిదా కు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన  ఆస్తులు ఆమె వారసులైన సైఫ్ కుటుంబానికి కూడా దక్కాయి . అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబిధా మాత్రమేనని ఆమె పాకిస్తాన్ కి వలస వెళ్లినందున వలన అది ఎనిమి ప్రాపర్టీ ప్రకారం ఆస్తులకు కాందీశికుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్ ఆఫ్ ఎనిమి నిర్ణయించింది . 2015 లో ఇదే విషయాన్ని ప్రకటించింది . ఆ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా పరిగణించాలని, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది.  సైఫ్ అలీ ఖాన్ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ, హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ కిభారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: