2014లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ `రేసుగుర్రం`తో విలన్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రవికిషన్. మొదటి సినిమాతోనే ఇక్కడ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రవి కిషన్.. ఆ తర్వాత `సుప్రీం`, `కిక్ 2`, `రాధా`, `సాక్ష్యం`, `ఎమ్మెల్యే` ఇలా చాలా చిత్రాల్లో న‌టించి ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే రవి కిషన్ నటన ప్రస్థానం ప్రారంభమైంది బాలీవుడ్ లో. ఆ తర్వాత భోజ్‌పురి లోనూ భారీ స్టార్డ‌మ్ సొంతం చేసుకున్నారు. అడ‌పా త‌డ‌పా త‌మిళ్‌, క‌న్న‌డ‌, గుజరాతీ, ఆంగ్ల చిత్రాల్లోనూ న‌టించాడు.


సినిమా గురించి ప‌క్క‌న పెడితే.. ఒక‌ప్పుడు ర‌వి కిష‌న్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో తెలిస్తే ఖ‌చ్చితంగా షాకైపోతారు. హీరోల‌నే మించేలా నిత్యం పాల‌తో స్నానం చేయ‌డం, గులాబీ రేకుల‌పై నిద్రించ‌డం వంటివి చేసేవాడ‌ట‌. ఇటువంటి లైఫ్ స్టైల్ కార‌ణంగా ర‌వి కిష‌న్‌ ప‌లు సినిమా అవ‌కాశాల‌ను కోల్పోయాడు. గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో ర‌వికిష‌న్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. `ఒకప్పుడు నేను పాలతో స్నానం చేసేవాడిని. గులాబీ రేకులపై నిద్రించేవాడిని. నటుడంటి ఇలాగే ఉండాలి అన్న భావనలో ఉండేవాడ్ని.


హాలీవుడ్ స్టార్స్ ఆల్ పాసినో, రాబర్ట్ డి నీరో వంటి స్టార్స్ సినిమాలు చూపిస్తూ.. వారంతా ఇలాగే జీవిస్తుంటారు అని చెప్పిన‌ప్పుడు అది నా మ‌న‌సులో నాటుకుపోయింది. అంద‌రూ నా గురించి కూడా గొప్ప‌గా మాట్లాడుకోవాల‌ని అనుకునేవాడ్ని.. అందుకే అలా చేశాను. కానీ ఈ విష‌యం డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కు తెలిసి ఆయ‌న త‌న గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ లో అవ‌కాశం ఇవ్వ‌లేదు. నా డిమాండ్స్ తీర్చేంత బ‌డ్జెట్ లేద‌ని చెప్పారు. అలా నా లైఫ్ స్టైల్ కార‌ణంగా చాలా సినిమా ఛాన్సులు కోల్పోయాను. ఆ త‌ర్వాతే ఎంతో శ్రమించి నటుడిగా మారాను.` అంటూ ర‌వికిషన్ చెప్పుకొచ్చాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: