
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "హరిహర వీరమల్లు" భారీ అంచనాల నడుమ విడుదల కు సిద్ధమవుతోంది. పాన్ ఇండియ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జ్యోతి కృష్ణ , ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించి గా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సోషల్ మీడియా నుంచి అదిరే రెస్పాన్స్ వచ్చింది . పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ అవతార్ , గ్రాండ్ విజువల్స్ , కీరవాణి సంగీతం ... ఈ చిత్రం పై అంచనాలను ఇంకొంచెం పెంచేశాయి . ట్రైలర్ చూసిన ప్రేక్షకులంతా సినిమా పై మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో, ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై క్లారిటీ వచ్చింది . తాజా సమాచారం ప్రకారం, జూలై 19 న తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించేందు కు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది . గతం లో వాయిదా పడిన ఈ వేడుకను ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా చూస్తున్నారట మేకర్స్ . త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన వెలువడనుంది . ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది , ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సీనియర్ నిర్మాత ఏం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.అలాగే ఈ చిత్రానికి లెజెండరీ కాంపోజర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించడం మరో హైలైట్ . పవన్ ఫ్యాన్స్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ఇక ఈ నెల 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు