
కాగా రాజమౌళి తన సినిమాలో హీరోయిన్స్ ని చూసుకునే విషయంలో చాలా చాలా పక్కాగా ఫాలో అవుతూ ఉంటారట . మరీ ముఖ్యంగా రాజమౌళి తన సినిమాలో హీరోయిన్స్ ని ఎక్కువగా కాల్ షీట్స్ చూసే చూస్ చేసుకుంటారట . బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ లని తన సినిమాలకు తీసుకోడు. బిజీగా కాల్ షీట్స్ కమిట్ అయిన హీరోయిన్ ల ని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ తన సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకోరట . వరుస షూటింగ్ లతో బిజీ బిజీ అంటూ తన వర్క్ కమిట్మెంట్ ని పక్కన పెట్టేస్తాడు అన్న కారణంగానే రాజమౌళి హీరోయిన్స్ ని కాల్ షీట్స్ చూసే చూస్ చేసుకుంటారట .
మరీ ముఖ్యంగా మగధీర సినిమాలో కాజల్ , ఈగ సినిమాలో సమంత. యమదొంగ సినిమాలో ప్రియమణి ఇలా ఆయన ఒక్కొక్క హీరోయిన్ ని చాలా పక్కాగా ప్లాన్ చేసి తీసుకున్నారట. ఆ కథలకి ఆ హీరోయిన్స్ సూట్ అవుతారు అన్న విషయం సినిమా రిలీజ్ అయ్యాకే అర్థం అయింది . నిజానికి సినిమా రిలీజ్ కి ముందు కొందరి హీరోయిన్స్ విషయంలో ఫాన్స్ బాధపడిన దాఖలాలు ఉన్నాయి . అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ కాంబో క్రేజీగా మారిపోయి ఫ్యాన్స్ మదిలో స్పెషల్ స్థానాన్ని సంపాదించుకున్నాయి. సినిమాల కోసం ఇంత పక్కాగా వర్క్ చేస్తారా డైరెక్టర్స్..అని రాజమౌళిని తెగ పొగిడేస్తున్నారు జనాలు. ప్రజెంట్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా కోసం ప్రియాంక చోప్రాని అనుకున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో ప్రియాంక క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వైల్డ్ గా ఉండబోతుంది అంటూ మేకర్స్ ద్వారా ఓ న్యూస్ బయటకు వచ్చింది..!