
ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ పోస్టులు పెడుతున్నారు . ఇలాంటి మూమెంట్లోనే ఏపీ డిప్యూటీ సీఎం టాలీవుడ్ ఇండస్ట్రిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తండ్రి శ్రీ శివశక్తి దత్త గారు కన్నుమూశారు అని తెలిసి చాలా చింతించాను.. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది .. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను .. కలలు సాహిత్యం పై ఎంతో అభిమానం కలవారు ఆయన .. తెలుగు సాంస్కృతిక సాహిత్యాలపై పట్టున శివశక్తి దత్త పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు . తండ్రి మరణంతో బాధపడుతున్న కీరవాణికి ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి " అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు .దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అయిపోతున్నారు. ఎప్పుడు సరదా సరదాగా ఉండే కిరవాణి ని ఇలా డల్ గా చూసి ఫ్యాన్స్ కూదా బాధపడిపోతున్నారు..!
శివశక్తి దత్త గారి అసలు పేరు కోడూరి సుబ్బారావు గారు. 1932 అక్టోబర్ 8న రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో ఆయన జన్మించారు. మొదటి నుండి ఆయనకు కళలపై ఉన్న ఆసక్తితో ఆయన కమలేశ్ అనే కలం పేరుతో చిత్రకారుడిగా పని చేశారు. ఆ తరువాత సంగీతంపై ఉన్న ఇష్టంతో గిటార్, సితార్, హార్మోనియం వంటివి నేర్చుకున్నారు. ఇందస్ట్రీలో ఆయన ను అభిమానించి ఆరాదించే వారు కూడా ఉన్నారు..!!