- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు నాలుగేళ్ల నుంచి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. క్రిష్ - ఏఎం. జ్యోతికృష్ణ‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సాలిడ్ గా ఉండడంతో సినిమాపై బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందా ? అన్న అంచనాలు ఉన్నాయి. అయితే తెలంగాణకు చెందిన ఓ వీరుడు కథ‌ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ ఈ చిత్రం నిజజీవితంలో ఏ ఒక్క నాయకుడు కథ‌ ఆధారంగా తెరకెక్కలేదని .. సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడు ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథ‌గా ఇది తెర‌కెక్కిందని చెప్తున్నారు. ముఖ్యంగా జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరమల్లు కథ‌ పూర్తిగా మారిపోయింది.


దర్శకుడు కథలోని స్ఫూర్తిని అలాగే ఉంచుతూ సరికొత్త కథ‌గా దీనిని మలిచారు. పురాణాల ప్రకారం అయ్యప్పస్వామిని శివుడు - మోహినీల కుమారుడిగా చెప్తారు. శైవం - వైష్ణవం మధ్య వారధిగా స్వామిని ఎలా వర్ణిస్తారో హరిహర వీరమల్లును శివుడు - విష్ణువు అవతారంగా చూడబోతున్నాం. సరిగ్గా గమనిస్తే హరి ( విష్ణు ) హర ( శివుడు ) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు - విష్ణువు అవతారం వీరమల్లు అని తెలిపేలా ఈ సినిమాలో పలు అంశాలు గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ సినిమాలో ఉపయోగించారు. అలాగే హీరో తన చేతుల్లోని శివుడిని సూచించే ఢ‌మరుకం పట్టుకున్నారు. అలా ఈ సినిమాలో హీరో ధర్మాన్ని రక్షించడానికి ... ధర్మం కోసం పోరాడటానికి శివుడు - విష్ణువు రూపంగా కనిపిస్తాడు అని చిత్ర యూనిట్ చెప్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: