
విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కగా త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి. ఈ సినిమా హిందీలో అయితే విడుదల కావడం లేదు. సౌత్ భాషల్లో మాత్రమే రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. కింగ్ డం సినిమాలో ట్విస్టులు మాత్రం ఒకింత ఆసక్తికరంగానే ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఈ సినిమా తర్వాత నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వార్2 ఆగష్టు నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా కోసం నాగవంశీ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు చేశారు. వార్2 సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తే మాత్రం ఈ సినిమా రేంజ్ మారిపోయే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.
ఆగస్టు నెల 27వ తేదీన రవితేజ నటించిన మాస్ జాతర మూవీ విడుదల కానుంది. భాను భోగవరపు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా అటు రవితేజ ఇటు భాను భోగవరపు ఈ సినిమాతో సక్సెస్ సాధించాల్సి ఉంది. నాగవంశీ ఈ మూడు సినిమాలతో దాదాపుగా 300 కోట్ల రూపాయలు రిస్క్ లో పెడుతున్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు