
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అవుతోన్న సినిమా కావడంతో కనివినీ ఎరుగని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో మొదలైన సినిమా యువ దర్శకుడు జ్యోతి కృష్ణ చేతుల్లోకి వెళ్లింది. పవన్ ముందు నుంచి పిరియాడికల్ సినిమా అని చెపుతూ వస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ కు రెడీ అవుతోన్న వేళ ఈ సినిమా గురించి మరో ఇంట్రస్టింగ్ టాపిక్ బయటకు వస్తోంది. క్రిష్ ఒక విజన్ తో ఈ సినిమాను స్టార్ట్ చేశారట. మొదట్లో అందరూ పీరియాడికల్ సినిమానే అనుకున్నారట.
అయితే ఇప్పుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాను టేకోవర్ చేశాక క్రిష్ పూర్తి చేయని భాగం పూర్తి చేయడంతో పాటు కథలో చాలా మార్పులు .. చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు వచ్చాక ఇది పెద్ద షాకింగ్ న్యూసే అని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి జ్యోతికృష్ణ పవన్ ను ఎలా టాకిల్ చేశాడు.. సినిమా ఎలా ఉండబోతోందో ? చూడాలి. ఈ అవైటెడ్ సినిమా ఈ జూలై 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు