
స్టార్ హీరోగా పేరు పొందిన మోహన్ లాల్ తో నటించాల్సిన చక్రం సినిమా మధ్యలోనే ఆగిపోయిందని.
ఈ సినిమా వల్ల రాత్రికి రాత్రి తన జీవితం మొత్తం ఒక్కసారిగా మారిపోయిందని వెల్లడించింది. ఆ సినిమా ఆగిపోవడంతో తనని ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారని ఇది చాలా బాధను కలిగించిందని వెల్లడించింది విద్యాబాలన్. మలయాళ స్టార్ హీరో గా పేరు పొందిన మోహన్ లాల్ తో కలిసి చక్రం సినిమాలో నటించడానికి సైన్ చేశాను.. కొద్దిరోజుల పాటు ఆ సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఈ సినిమా గురించి చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఆగిపోయిందని తెలిపింది.
అయితే సినిమా ఆగిపోవడానికి ముఖ్య కారణం తానే అంటూ చాలా ప్రచారం కూడా చేశారు దీంతో తన మీద ఐరన్ లెగ్గానే ముద్ర వేశారనీ చాలా బాధపడ్డానని.. దీంతో రాత్రికి రాత్రి తాను నటించాల్సిన తొమ్మిది సౌత్ సినిమాల నుంచి తనను తొలగించడంతో ఆ ఒక్క సినిమా తన జీవితాన్నే మార్చేసింది అంటూ తెలిపింది విద్యాబాలన్.. కానీ ఆ తొమ్మిది ప్రాజెక్టులు ఆగిపోవడానికి తనకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. డైరెక్టర్లకు హీరోలకు నిర్మాతలకు మధ్య వచ్చిన మనస్పర్ధల వల్లే ఆగిపోయాయని కానీ ఆ ఎఫెక్ట్ మాత్రం తన కెరీర్ మీద చాలా చూపించింది అంటే తెలిపింది. అయితే వచ్చిన అవకాశాన్నల్లా ఉపయోగించుకొని పేరు సంపాదించి ఎన్నో అవార్డులను అందుకని బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది.