సిద్ధార్థ్ , శరత్ కుమార్ ప్రధాన పాత్రలో 3 BHK అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీని జూలై 4వ తేదీన థియేటర్లో విడుదల చేశారు. పెద్దగా అంచనాలు లేకుండా తెలుగులో కూడా ఈ సినిమా విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ఈ మూవీ కి మంచి టాక్ రావడం మొదలు అయింది. దానితో ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కూడా దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్త తక్కువ టార్గెట్ తోనే బరిలోకి దిగింది. ఈ సినిమాకు మంచి టాక్ కూడా రావడంతో ఈ మూవీ ఈజీగా బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో హిట్ స్టేటస్ను అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ మూవీ హిట్ స్టేటస్ను అందుకోవడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కష్టపడుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఇంకా ఎన్ని కలెక్షన్లు వస్తే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో హిట్టు స్టేటస్ ను అందుకుంటుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 59 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 10 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 48 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఆరు రోజుల్లో ఈ మూవీ కి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.17 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా కేవలం 1.17 కోట్ల కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది. ఇక ఈ మూవీ మరో 1.33 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: