అల్లు అర్జున్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి హీరోలతో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగు పెట్టారు. గతంలోనే ఆయన ఏషియన్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణానికి చర్చలు జరిపారు.. అలా చర్చలు సఫలం అయ్యాక వనస్థలిపురం శివార్లలో ఏఆర్టి అనే మల్టీప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నారు. ప్రస్తుతం ఏఆర్టి మల్టీప్లెక్స్ నిర్మాణం చివరిదశకు వచ్చింది. ప్రస్తుతం ఆ మల్టీప్లెక్స్ లో ఇంటీరియర్ డిజైన్ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.అయితే ఏఆర్టి మల్టీప్లెక్స్ త్వరలోనే గ్రాండ్ గా ఓపెనింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది.అంతేకాదు ఈ జూలైలోనే ఏఆర్టి మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కాబోతున్నట్టు టాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

అంతేకాదు రవితేజ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ ఆ స్టార్ హీరో సినిమాతో స్టార్ట్ కాబోతున్నట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. మరి ఇంతకీ రవితేజ మల్టీప్లెక్స్ ఏ హీరో మూవీ తో స్టార్ట్ అవ్వబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. రవితేజ ఎఆర్టి మల్టీప్లెక్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా తో గ్రాండ్ గా ఓపెనింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీని జూలై 24న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.

దీంతో రవితేజ ఏఆర్టి మాల్ కూడా జూలైలోనే ఓపెనింగ్ చేస్తున్నారనే వార్తలు వినిపించడంతో రవితేజ ఏఆర్టి ఓపెనింగ్ ని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో స్టార్ట్ చేయబోతున్నట్టు టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక రవితేజ ఏఆర్టి మాల్ మల్టీప్లెక్స్ లోని విశేషాలు చూస్తే.. అత్యాధునిక సాంకేతికతతో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం,57 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్ తో ఉందట.అంతేకాదు ఈ సినిమా ప్రేక్షకులకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందని తెలుస్తోంది.. ఇక ఇప్పటికే పలుమార్లు ఈ మల్టీఫ్లెక్స్ టెస్టింగ్ కూడా నిర్వహించారట.ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కి రెడీగా ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: