- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లెజెండ్రీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా విశ్వంభర. బింబిసారా సినిమాతో ఒక్కసారిగా అందరినీ తన వైపునకు తిప్పుకున్న దర్శకుడు మల్లిడి వశిష్ట తెర‌కెక్కిస్తున్న ఈ భారీ వండర్ సినిమా కోసం సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల కావలసిన ఈ సినిమా పలుమార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా ? అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడో సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇంకా రాలేదు. సమ్మర్లో వస్తుందని అనుకున్న అది కూడా జరగలేదు. ప్రస్తుతం సెప్టెంబర్ 18న డిసెంబర్ ఆగమనం ఉంటుందని టాలీవుడ్ సర్కిల్స్ లో స్ట్రాంగ్ బజ్‌ మొదలైంది.


ఇదే కాకుండా సేఫ్ సైడ్ గా సెప్టెంబర్ 25న కూడా మేకర్స్ చూస్తున్నారట. ఇది నిజమైతే అక్కడ చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజి ఆల్రెడీ షెడ్యూల్ అయింది. విశ్వంభర ఆ డేట్ కు వస్తే కచ్చితంగా ఓజి సినిమాకు ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వంభర రిలీజ్ డేట్ పై మెగా అభిమానుల‌లోనే ఎక్కువ ఉత్కంఠ నెల‌కొంది అని చెప్పాలి. విశ్వంభ‌ర ఆ డేట్ కు లాక్ అయితే ఓజీ త‌ప్ప‌క వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: