టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో డైరెక్టర్స్ తహతహలాడుతుంటారు. అలాంటిది ప్రభాస్ తో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ చేతి దాకా వస్తే రిజెక్ట్ చేశాడో డైరెక్టర్. అయితే ఇది ఇప్ప‌టి ముచ్చ‌ట కాదు.. ఇర‌వై ఏళ్ల క్రితం జ‌రిగింది. కాక‌పోతే ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? ఎందుకు ప్రభాస్ తో సినిమా చేయనన్నాడు? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


2007లో ప్ర‌భాస్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వ‌చ్చిన `యోగి` సినిమా గుర్తుందా? పి. రవీంద్రనాథ్ రెడ్డి నిర్మించిన ఈ యాక్ష‌న్ డ్రామాలో న‌య‌న‌తార హీరోయిన్‌. సుబ్బరాజు, ప్రదీప్ రావత్, కోట శ్రీనివాసరావు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. రమణ గోగుల సంగీతం అందించారు.  భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన యోగి మూవీ యావరేజ్ గా ఆడింది.
అయితే ఈ సినిమాకు 2005లో వ‌చ్చిన‌ కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రం `జోగి`కి రీమేక్. అక్క‌డ ప్రేమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. శివ రాజ్ కుమార్ హీరోగా న‌టించారు. జోగి తెలుగు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని భావించిన‌ప్పుడు మొద‌ట ప్రేమ్‌నే డైరెక్ట్ చేయ‌మ‌ని అడిగార‌ట‌. కానీ అందుకు ఆయ‌న నో చెప్ప‌డం జ‌రిగింది. ఈ విష‌యాన్ని త‌న `కెడి` మూవీ టీజ‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ వ‌చ్చిన డైరెక్టర్ ప్రేమ్ స్వ‌యంగా వెల్ల‌డించారు. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన యోగి సినిమాను త‌న‌నే డైరెక్ట్ చేయమని మొద‌ట అడిగార‌ని.. కానీ త‌న‌కు తెలుగు రాదు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల నో చెప్పాన‌ని ప్రేమ్ తెలిపాడు. ఇప్పుడీ విష‌యం నెట్టింట వైర‌ల్ గా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: