
ఆ ప్రొగ్రాంలో అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అయిన అడగొచ్చు .. దానికి ఆన్సర్ ఇవ్వడానికి నేను సిద్ధమే అంటూ ఆ వీడియోలు చెప్పుకొచ్చారు . "సోది చెప్పుకుందాం రండి" అంటూ తన ఫాలోవర్స్ ను ఉద్దేశించి జగపతిబాబు ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు . ఆయన మాట్లాడుతూ .."ఇంస్టాగ్రామ్ లో తాను పెట్టే పోస్టులకు మంచి స్పందన వస్తుంది . నేను కూడా చూస్తున్నాను. మీరు చాలా మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు . కానీ ప్రతి దానికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను . అందుకే ఒక ప్రోగ్రాం ప్లాన్ చేస్తున్నాను .
ఆ ప్రోగ్రాం లో మీరు ఎలాంటి ప్రశ్నలు అయిన అడగొచ్చు.. నేను సమాధానం చెప్తాను. వివాదాలకి తావివ్వకుండా చూడాలి అంటూ కోరుకుంటున్నాను. అయినప్పటికీ కాంట్రవర్సీ చేయడానికి పిచ్చి నా కొ*కులు రెడీగా ఉంటారు" అంటూ జగపతిబాబు మాట్లాడారు. దీనితో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటల తాలూకా వీడియో వైరల్ అవుతుంది . అంతేకాదు ఆయనను ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటూ" నేను నమస్తే చెప్పను అది బోరింగ్ గా ఉంటుంది . బాగున్నారా అని అస్సలు అడగను ఎందుకంటే బాగుంటేనే కదా మీరు షో చూస్తారు" అంటూ తనదైన స్టైల్ లో మాట్లాడారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..!!