కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్గా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పోకిరి అనే స్టైలిష్ యాక్షన్ ఏంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాజర్ , మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటించాడు. మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యే అప్పటివరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే తాజాగా ప్రముఖ కథ రచయిత తోట ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

 ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పోకిరి సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా తోటా ప్రసాద్ మాట్లాడుతూ ... పోకిరి సినిమాకు మొదట ఆ టైటిల్ ను అనుకోలేదు. పూరి జగన్నాథ్ "పోకిరి" సినిమా కథ చిన్న పాయింట్ గా ఉన్న దశలో ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ ను అనుకున్నారు. అదే టైటిల్ తో సినిమా కథను పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత ఆ టైటిల్ ను మార్చేసి పోకిరి అనే టైటిల్  ను ఫిక్స్ చేశారు అని తోట ప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

పోకిరి మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బిజినెస్ మాన్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా మహేష్ బాబు , పూరి జగన్నాథ్ కాంబో లో వచ్చిన పోకిరి మరియు బిజినెస్ మాన్ రెండు సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: