కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే ఇండియన్ సినిమా హిస్టరీలో 100 కోట్లు కలెక్షన్లను చేసిన సినిమాలను చాలా గొప్పగా చూసేవారు. ఆ సినిమాలను బ్లాక్ బాస్టర్లుగా పరిగణించేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా మారాయి. కొంత మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలకు మొదటి రోజే వంద కోట్లకు మించిన కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే 100 కోట్లు వస్తున్నాయి కదా అని ఆ సినిమాలు అన్ని అద్భుతమైన విజయాలను అందుకున్నట్లు కాదు. ఎందుకు అంటే 100 కోట్ల కలెక్షన్లను సాధించిన సమయంలో బ్లాక్ బాస్టర్ అన్న సినిమాల బడ్జెట్ 50 , 60 కోట్లు దాటేది కాదు. కానీ ఇప్పుడు మొదటి రోజు 100 కోట్లు కలెక్షన్లు వసూలు చేస్తున్న సినిమాలకు బడ్జెట్ మాత్రం వందల కోట్లు అవుతుంది. దానితో సినిమా మొదటి రోజు వందల కోట్లను కలెక్ట్ చేసిన ఓవరాల్ గా సేఫ్ జోన్ లోకి వెళ్లడం కష్టంగానే మారింది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ , అట్లీ కాంబోలో ఓ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ తో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను అందుకున్నాడు. ఈ సినిమా దాదాపు 1600 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక అట్లీ దర్శకత్వంలో ఆఖరుగా రూపొందిన జవాన్ మూవీ 1000 కోట్లకు మించిన కలెక్షన్లను వసూలు చేసింది. వీరి కాంబోలో రూపొందుతున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న సినిమాకు బడ్జెట్ మరియు ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాలి అనే దానిపై మేకర్స్ ఇప్పటికే పక్కా క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలని , ఈ సినిమా 2000 కోట్ల టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇదేగాని జరిగితే ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో మిగిలిపోవడం ఖాయం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: