బాలీవుడ్ లో మాఫియా డామినేషన్ 1980 - 1990 లలో ఒక రేంజ్ లో ఉండేది. అప్పట్లో మాఫియా కనుసన్నల్లో బాలీవుడ్ నడిచేది. సినిమాల నిర్మాణం హీరోల ఎంపిక చివరికి దర్శకుడు ఎవరో ? డిసైడ్ చేసేది కూడా మాఫీయానే ..! ఎవరైనా నిర్మాత చెప్పిన మాట వినకపోతే తూటాకు బలవవాల్సిందే. అప్పట్లో తాను రికమండేషన్ చేసిన హీరోయిన్ కి అవకాశం ఇవ్వలేదని ఒక నిర్మాతనే లేపేసాడు గ్యాంగ్ స్టార్ దావూద్ ఇబ్రహీం. అలా బాలీవుడ్ మాఫియా కనుసన్నల్లో బిక్కుబిక్కుమంటూ బతుకు సాగించేది. అప్పట్లో దేవానంద్ లాంటి పెద్ద స్టార్స్ ను నటించిన పాకిస్తానీ నటి అనిత ఆయూబ్‌ను దావుద్ పిచ్చిగా ప్రేమించాడని కథనాలు వచ్చాయి. ఆయుబ్ కారణంగానే నిర్మాత సిద్ధికి హతమయ్యాడు. ఆమెకు హీరోయిన్గా అవకాశం ఇవ్వలేదని నిర్మాత సిద్ధికిని దావూద్ చంపినట్లు వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా మందాకిని - ఆయుబ్ లాంటి స్టార్ హీరోయిన్ల జీవితాలను దావూద్ తీవ్రంగా ప్రభావితం చేశాడని అప్పట్లో బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.
అనిత ఆయూబ్ పాకిస్తాన్లోని కరాచీ జన్మించింది. మాస్టర్స్ డిగ్రీ చేసి హీరోయిన్గా రాణించేందుకు ముంబై వచ్చింది. ప్రముఖ నటుడు దేవానంద్ ఆమె అద్భుతమైన అందం .. నటనకు మగ్ధుడై తన ప్యార్ కా తరానా సినిమాలో అవకాశం కల్పించాడు. తర్వాత సూపర్ హిట్ సినిమా గ్యాంగ్ స్టార్ లో కూడా ఆయుబ్ నటించింది. దావూద్ ఇబ్రహీంతో కలిపి ఆమెపబ్లిక్ లో కనిపించేది. ఒకానొక దశలో ఆమె దావూద్‌కు గూడాచారి అన్న అనుమానాలు వచ్చాయి. చివరగా అనిత పాకిస్తాన్ కు తిరిగి వెళ్లి భారతీయ వ్యాపారవేత్త సౌమిల్ పటేల్ను వివాహం చేసుకుంది. ఈ జంటకు షెజార్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. తర్వాత ఈ బంధం బ్రేక్ అయింది. అనంతరం ఆమె పాకిస్తాన్ వ్యాపారవేత్త శుభాక్ మజీదును పెళ్లి చేసుకుని స్థిరపడింది. గొప్ప నటిగా ఓ వెలుగు వెలిగిన పరిశ్రమ నుంచి మాయమైంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు