త్వరలోనే అతిపెద్ద భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి . ఈ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ పెద్దగా ఆశించిన అంత హిట్ సినిమాలు రాలేకపోతున్నాయి.  సెకండ్ హాఫ్ లో అయినా సరే సినిమాలు హిట్ అవుతాయి అంటూ అశలు పెట్టుకుంటున్నారు సినీ లవర్స్ . మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మొత్తం కూడా భారీ పాన్ ఇండియా సినిమాలు  రిలీజ్ అవుతూ ఉండడం గమనార్హం. అయితే ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ - ప్రభాస్ - రజనీకాంత్ - బాలయ్య లాంటి స్టార్ హీరోలు ఉన్నారు . సెకండ్ హాఫ్ లో మొదటగా రిలీజ్ అయ్యే సినిమా "హరిహర వీరమల్లు". జూలై 24న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
 

ఈ సినిమాపై ఫ్యాన్స్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు . ఎన్నో సార్లు రిలీజ్ కి సిద్ధమై పోస్ట్ పోన్ అయ్యి ఫైనల్లీ జులై 24న రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుంది అనేది అందరూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . పైగా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా కూడా స్టార్ అయిపోయాడు . పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత ఫస్ట్ రిలీజ్ కాబోతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా హిట్ అవుతుంది.  ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ కలిసి నటించారు .



ఈ సినిమాపై కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . ఆగస్టు 14వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అదే మూమెంట్లో "కూలి" సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . రజనీకాంత్ మన తెలుగు హీరో నాగార్జున కలిసి నటించిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదలవుతుంది . వార్ 2 కి ఇది బిగ్ కాంపిటీషన్ . చూడాలి మరి ఏ సినిమా హిట్ అవుతుందో..?



ఇక సెప్టెంబర్ 5న యంగ్ హీరో తేజ నటించిన "మీరాయి" రిలీజ్ కాబోతుంది.  ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది.  సెప్టెంబర్ లో నటసింహం బాలకృష్ణ తొలి పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. ఒకవేళ అక్కడ పోస్ట్ పోన్ అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి . ఇక ఓజి సినిమా కూడా సెప్టెంబర్ నెలలోనే వస్తుంది . అక్టోబర్ లో తెలుగు స్టార్స్ నటించిన ఏ పాన్ ఇండియా మూవీ రావడం లేదు. అయితే తెలుగు నాటు సైతం విశేష ఆదరణ పొందిన కాంతర  సినిమాకు ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ 1 అక్టోబర్ 2 రిలీజ్ కాబోతుంది . నవంబర్ లో ఇప్పటివరకు ఏ సినిమా డేట్ ఫిక్స్ చేసుకోలేదు. అయితే డిసెంబర్ 5 మాత్రం రెబెల్ స్టార్ ప్రభాస్ .."రాజా సాబ్" తో ముందుకు రావడానికి సిద్ధమైపోయాడు.  క్రిస్మస్ స్పెషల్ గా ఆడవి శేష్ నటించిన "డెకాయ్" సినిమా రాబోతుంది . ఇలా సెకండ్ హాఫ్ మొత్తం కూడా భారీ పాన్ ఇండియా స్థాయి  మూవీస్ ఉండడం కమనార్హం.  అయితే వీటిలో ఏ సినిమా హిట్ అవుతుంది అంటే మాత్రం చాలా మంది "హరిహర వీరమల్లు".. "రాజా సాబ్" అంటున్నారు . ఆ లిస్ట్ లో "అఖండ 2" కూడా ఉంది . చూడాలి మరి సెకండ్ హాఫ్ లో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలలో ఏ మూవీ హైయెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: