
ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతుంది . తప్పు అంటే తప్పు కరెక్ట్ అంటే కరెక్ట్ . ఇలానే ఫాలో అయ్యే ఉమెన్ . ఆ కారణంగానే నిత్యామీనన్ ఇండస్ట్రీలో ఎక్కువగా అవకాశాలు దక్కించుకో లేకపోయింది . కెరియర్ స్టార్టింగ్ లో సూపర్ డూపర్ హిట్ సినిమా లల్లో అవకాశాలు సంపాదించుకున్న నిత్యామీనన్ ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోలేకపోతోంది. దానికి కారణం ఆమె ఉన్నది ఉన్నట్లు మాట్లాడడమే . కాగా రీసెంట్గా నిత్యామీనన్ మాట్లాడిన మాటలు మరొకసారి వైరల్ అవుతున్నాయి .
నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ .."స్టార్ హీరోలతో సినిమా చేయడం వేస్ట్ అని.. దాని వల్ల ఏం ఒరిగేది ఉండదు అని.. మనలో టాలెంట్ ఉండాలి అని ..మనలో టాలెంట్ లేనప్పుడు ఎంత పెద్ద హీరో సినిమాలో నటించిన అవకాశాలు హిట్లు పడవు " అంటూ పరోక్షకంగానే చెప్పుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె మాట్లాడిన మాటలు ట్రెండ్ అవుతున్నాయి. నిత్యామీనన్ ఇలాంటి ముక్కుసూటి తనంతో మాట్లాడే మాటలు ఆమెకు ఆఫర్స్ రాకుండా చేస్తున్నాయి అంటున్నారు కొంతమంది అభిమానులు. కొంతమంది మాత్రం గుడ్ ఇలానే ఉండాలని ..ఉన్నది ఉన్నట్లు మాట్లాడితేనే మీ వాల్యూ ఉంటుంది అని..హీరోయిన్ తర్వాత ముందు నువ్వు ఒక అమ్మాయివి నీ ఒపీనియన్ నీకు ఉంటుంది అంటూ ఆమె మాట్లాడిన నిజాయితీ తనానికి అప్రిషియేట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది నిత్య మీనన్..!!