సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది మంచి క్రేజ్ ఉన్న నటీ నటులు కూడా చాలా తక్కువ సినిమాల్లో నటిస్తూ వస్తారు. ఇక అలాంటి వారు తెలుగు సినీ పరిశ్రమలో కూడా కొంత మంది ఉన్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.

దిశా పటాని : ఈ బ్యూటీ చాలా సంవత్సరాల క్రితం లోఫర్ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించకపోయిన ఈ మూవీ ద్వారా ఈమెకి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. కానీ ఈమె ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కాకుండా హిందీ సినిమాల్లో నటించడం పై పెద్ద ఎత్తున ఆసక్తిని చూపించింది. ఇక చాలా కాలం తర్వాత ఈమె ప్రభాస్ హీరో గా రూపొందిన కల్కి 2898 AD అనే తెలుగు సినిమాలో నటించింది. 

కియారా అద్వానీ : ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన భరత్ అనే నేను మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తక్కువ కాలం లోనే ఈమె మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన వినయ విధేయ రామ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. దానితో ఈమె వరస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈమె ఆ తర్వాత పెద్ద గ్యాప్ తీసుకొని కొంత కాలం క్రితం రామ్ చరణ్ హీరో గా రూపొందిన గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

మృనాల్ ఠాకూర్ : మొదట హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె సీత రామం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె చాలా తక్కువ గ్యాప్ లోనే హాయ్ నాన్న , ది ఫ్యామిలీ స్టార్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ అడవి శేషు హీరో గా రూపొందుతున్న డేకాయిట్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈమె కూడా వరుస పెట్టి సినిమాలు చేయకుండా సినిమా సినిమాకు మధ్య చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: