- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఆత‌ను నాలుగుసార్లు పెళ్లి చేసుకునేవరకు వచ్చి చివర్లో వెనక్కి తగ్గానని చెప్పారు నిత్యామీనన్. ప్రతిసారి లవ్ బ్రేక్ అయిందని తెలిపారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అనేది తనకు ప్రాధాన్యత కాదని .. సామాజిక అంచనాలు ఒత్తిడి నుంచి విముక్తి పొందానని .. సాంప్రదాయ ప్రేమ సంబంధాల బయట చాలా హ్యాపీగా జీవిస్తున్నానని తెలిపింది. ప్రేమ పేరుతో ఎదురు దెబ్బలు తిన్నానని ప్రతిసారి ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నానని .. అయితే ఇంట్లో పెద్దలు పెళ్లి చేసుకోవాలని చెబుతూ ఉంటారు .. వారి బాధ కూడా తాను అర్థం చేసుకోగలను అని తెలిపింది. నా రిలేషన్ షిప్స్ అన్ని విచారకరంగా ముగిశాయ‌ని కూడా చెప్పింది. వ్యక్తిగతంగా ప్రేమలో దెబ్బలు తిన్న తర్వాత ఉందో లేదో తెలియని ప్రేమ గురించి వెతుకుతున్న అని నిత్య తెలిపారు. నాతో సంబంధం లో ఉన్న భాగస్వామి నన్ను దోపిడీ చేయడానికి ప్రయత్నించాడని నిత్య వెల్లడించింది.


వివాహం చేసుకునే విషయంలో తనకు ఎలాంటి అత్యవసరం లేదని .. తోడు దొరికితే తల్లిదండ్రులు సంతోషిస్తారని తన ఆలోచనలకు వారి మద్దతు కూడా ఉంటుందని తెలిపింది. అమ్మమ్మ జీవించి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని చాలా ఒత్తిడి చేసేదని .. స్టార్డంతో సంబంధం లేకుండా తన ఆలోచన అలా ఉండేది .. ఇప్పుడు అన్ని సామాజిక అంచనాల నుంచి విముక్తి పొందాను.. తల్లిదండ్రులు నా ఎదుగుదల .. ఆలోచనలు అర్థం చేసుకుని గౌరవిస్తున్నారు అని తెలిపింది. ఒంటరిగా ఉండటం అంటే అసంపూర్ణంగా ఉండటమే అని అర్థం చేసుకున్నాను అని నిత్య తెలుపుతోంది. రతన్ టాటా వంటి ప్రముఖుడు శృంగార సంబంధాలతో పని లేకుండా ఆనందంగా జీవించాలని పెళ్లి తనకు ప్రాధాన్యత కూడా కాదని తెలిపింది. ఇక గతంలో నిత్య ఓ ఇంటర్వ్యూలో తాను నాలుగు సార్లు పెళ్లి చేసుకునే వరకు వచ్చాను .. ప్రతిసారి ఏదో ఒక కారణంతో వెనక్కి తగ్గాను అని చెప్పారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: