టాలీవుడ్ యంగ్ టైగర్  ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్ 2’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సంపాదించుకుంది. స్పై యాక్షన్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలై సంచలనం సృష్టించింది. అయితే ఈ ట్రైలర్‌కు ఎంతగానో ఆదరణ లభించినప్పటికీ .. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా అంతే స్థాయిలో మొదలయ్యాయి. ట్రైలర్‌లో హృతిక్ రోషన్‌కు ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని, తారక్ పాత్రను తక్కువ చూపించారని కొన్ని యాంటీ గ్రూప్స్ కామెంట్లు చేయడం ప్రారంభించాయి. ఎన్టీఆర్ పాత్ర పై విపరీతమైన ఊహాగానాలు, తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు పెట్టడంతో నెటిజన్ల మధ్య హీటెడ్ డిబేట్ మొదలైంది.


ఇదంతా చూసిన తారక్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ట్రైలర్‌నే ఆధారంగా తీసుకుని ఇలా అర్థం లేని ట్రోల్స్ చేయడం సరికాదు” అని తారక్ ఫ్యాన్స్ ఎదురు బుద్ధి చెబుతున్నారు. తారక్ పాత్రకు డెప్త్, పవర్, ఇంటెన్సిటీ ఉన్నట్టు ట్రైలర్‌లోని డైలాగ్స్‌మే చాటి చెప్పుతున్నాయంటూ వారు రిప్లై ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఫైటింగ్ సీన్‌లో తారక్ ఎంట్రీ, డైలాగ్ డెలివరీ చూసినవాళ్లకు సినిమా మీద ఇంకెంత అంచనాలు పెరుగుతాయో స్పష్టం అవుతుందని అంటున్నారు. "హృతిక్ ఫ్యాన్స్, తారక్ ఫ్యాన్స్ ఒకే సినిమా కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తుంటే.. మధ్యలో ఇలా నెగటివ్ ప్రచారం అవసరమా?" అంటూ సిని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.


ట్రైలర్ అనేది కేవలం టేస్టర్స్ మాత్రమేనని, అసలు కంటెంట్ ఆగస్టు 14న థియేటర్స్‌లో తెలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు మేకర్స్ మాత్రం ట్రోల్స్‌తో ఏమాత్రం తలొగ్గకుండా ప్రమోషన్ స్పీడ్ పెంచుతున్నారు. తెలుగులో ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తారక్ హాజరైతే.. ట్రోల్స్‌కి మళ్లీ గట్టి స‌మాధ‌నం దక్కుతుందనడంలో సందేహం లేదు. మొత్తానికి ట్రైలర్ రేంజ్ చూస్తే.. వార్ 2 పై క్రేజ్ పీక్స్ లో ఉంది. ట్రోల్స్ ఎలాగైనా వస్తాయి. కానీ తారక్ పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే.. ఆగస్టు 14వరకూ వేచి చూడాల్సిందే!



మరింత సమాచారం తెలుసుకోండి: