టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఇక ఈయన పెళ్లి చూపులు అనే మూవీ లో మొదటి సారి హీరో గా నటించాడు. ఈ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. దానితో ఈయనకు మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈయన నటించిన అర్జున్ రెడ్డి మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన క్రేజ్ ఒక్క సారిగా భారీగా పెరిగిపోయింది. ఈ మధ్య కాలంలో మాత్రం విజయ్ నటించిన సినిమాలు వరుసగా బోల్తా కొడుతూ వస్తున్నాయి.

ఆఖరుగా ఈయన నటించిన లైగర్ , ఖుషి  , ది ఫ్యామిలీ స్టార్ మూవీలు వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా వరుస అపజయాలతో డీలపడిపోయిన విజయ్ తాజాగా కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో భాగ్యశ్రీ  బోర్స్ హీరోయిన్గా నటించగా ... గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టింది. ఇకపోతే తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఏకంగా 40 ఫీట్ల కటౌట్ ను తయారు చేయించినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం స్టార్ హీరోలకు ఇలాంటి కటౌట్లను రెడీ చేస్తూ ఉంటారు. ఇక విజయ్ దేవరకొండ కు కూడా భారీ కటౌట్ ను రెడీ చేయడంతో ఈయన క్రేజ్ మామూలుగా లేదుగా అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd