యాంకర్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..లేడి విలన్ గా... సినీ ఇండస్ట్రీలో తన హవాని కొనసాగిస్తున్న అనసూయ భరద్వాజ్ అంటే తెలియని వారు ఉండరు. ఈ ముద్దుగుమ్మ ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటించింది.అలా సినిమాల్లో స్టార్ గా రాణించాక యాంకరింగ్ ని పూర్తిగా మానేసింది.ప్రస్తుతం అనసూయ రేంజ్ మారిపోయింది. ఆమెని చాలామంది దర్శక నిర్మాతలు స్టార్ హీరోలు సినిమాల్లో విలన్ పాత్రల్లో, కీరోల్స్ కోసం తీసుకుంటున్నారు. అనసూయకు ఇప్పటివరకు విమానం మూవీలో వేశ్య పాత్రలో, రంగస్థలం మూవీలో రంగమ్మత్త, పుష్ప సినిమాలో ద్రాక్షాయిణి ఈ మూడు పాత్రలు ఇండస్ట్రీలో ఆమె రేంజ్ ని పెంచేసాయని చెప్పుకోవచ్చు.

అయితే అలాంటి అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన కామెంట్లు చేసింది.నా లైఫ్ లో నువ్వు లేవు.. అందుకే వదిలేస్తున్నా అంటూ ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. మరి అనసూయ భరద్వాజ్ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడింది.. ఇంట్లో వారి గురించా లేక బయట వారి గురించి ఇలా మాట్లాడిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అనసూయ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. సోషల్ మీడియాలో జరిగే ఏ సమస్య గురించైనా సరే చాలా తొందరగా స్పందిస్తూ ఉంటుంది.అయితే అప్పుడప్పుడు ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటుంది.

అయితే తాజాగా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న  అనసూయ తనకు సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అనసూయ మాట్లాడుతూ.. నేను సోషల్ మీడియాలో చాలా విమర్శలకు గురయ్యాను. అయితే వారందరూ చేసే విమర్శలను ట్రోలింగ్ ని చూస్తూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు.అందుకే నా గురించి ఎవరైనా అడ్డదిడ్డంగా చెడుగా మాట్లాడితే వారిని వెంటనే సోషల్ మీడియాలో బ్లాక్ చేసి పారేస్తా. చాలాసార్లు నెటిజన్లు చేసే కామెంట్లను భరించలేకపోయా.. కొన్నిసార్లు రియాక్ట్ అయ్యా. మరి కొన్నిసార్లు సైలెంట్ గా ఉండిపోయాను.

అందుకే చివరిగా వారిని నా సోషల్ మీడియా ఖాతా నుండి పూర్తిగా డిలీట్ చేసేసాను. నా లైఫ్ లో నువ్వు లేవు అంటూ వారిని బ్లాక్ చేశాను.ఇప్పటివరకు నేను దాదాపు మూడు మిలియన్ల మంది అంటే 30 లక్షల మంది వరకు బ్లాక్ చేశాను. అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నెటిజెన్లు నీ ఫాలోవర్లే అంత మంది లేరు. నువ్వు 30 లక్షల మందిని ఎలా బ్లాక్ చేస్తావ్ అంటూ మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: