సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారి ప్రేమ కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొంతమందేమో చూసిన మొదటి క్షణానికే ప్రేమలో పడిపోతూ ఉంటారు.ఇక మరికొంత మందేమో ఏళ్ల తరబడి జర్నీ చేశాక ప్రేమలో పడతారు. అలా రమ్యకృష్ణ కృష్ణవంశీలవ్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక వీరిని పరిచయం చేసింది కూడా ఓ నటుడు. మరి ఇంతకీ వీరి ప్రేమ పెళ్లికి కారణమైన ఆ నటుడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. కృష్ణవంశీ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో స్టార్ కాకముందే రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో రాణిస్తోంది.అలా కృష్ణవంశీ గులాబీ సినిమా తెరకెక్కించిన సమయంలో ఈ సినిమాలోని మేఘాలలో తేలిపోమన్నది అని బైక్ మీద వచ్చే సాంగ్ చాలా హిట్ అయింది.

అయితే ఈ పాట విన్న రమ్యకృష్ణ పాట చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ఒక సాంగ్ ఇప్పటివరకు టాలీవుడ్ లో చూడలేదు అంటూ తెగ పొగిడేసిందట. అంతే కాదు ఆ సినిమా డైరెక్టర్ మొహం చూడక ముందుకే ఈ డైరెక్టర్ చాలా గ్రేట్ అంటూ మెచ్చుకుందట. ఆ తర్వాత చాలా సార్లు ఈ సినిమాని డైరెక్ట్ చేసిన వ్యక్తిని కలవాలి అంటూ అనుకుందట.అలా చివరికి మోహన్ బాబు హీరోగా చేసిన అదిరింది అల్లుడు మూవీ షూటింగ్ సెట్లో రమ్యకృష్ణ హీరోయిన్ గా చేస్తున్న తరుణంలో కమెడియన్ బ్రహ్మానందం రమ్యకృష్ణ కృష్ణవంశీ ఇద్దరినీ ఒకరికి ఒకరిని పరిచయం చేశారట.అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

ఆ తర్వాత నాగార్జునతో కృష్ణవంశీ చేసిన నిన్నే పెళ్ళాడుతా హిట్ అవ్వడంతో చంద్రలేఖ సినిమా చేసే అవకాశం కూడా నాగార్జున కృష్ణ వంశీ కి ఇచ్చారు.అలా నాగార్జునతో చంద్రలేఖ మూవీ చేస్తున్న సమయంలోనే రమ్యకృష్ణకి కృష్ణవంశీకి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారి దాదాపు 6 సంవత్సరాలు ప్రేమించుకుని చివరికి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరి ప్రేమ పెళ్లికి గుర్తుగా రిత్విక్ కృష్ణ అనే అబ్బాయి కూడా పుట్టారు.అలా రమ్యకృష్ణ కృష్ణవంశీల పరిచయం, ప్రేమ, పెళ్లికి బ్రహ్మానందం కారణమయ్యారు. ఇక రమ్యకృష్ణ పెళ్లి అయ్యాక కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి మంచి పాత్రలు పోషిస్తుంది. ఇక పెళ్లయ్యాక రమ్యకృష్ణ తన భర్త డైరెక్షన్లో శ్రీ ఆంజనేయం, రంగమార్తాండ  వంటి రెండు సినిమాల్లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: