
బాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండటంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టంతా ఈ సినిమా మీదే ఉంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో, పఠాన్ చిత్రంతో మాసివ్ సక్సెస్ సాధించిన స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ 2కు దర్శకత్వం వహిస్తున్నారు.
వార్ 2లో హృతిక్ రోషన్ ఎప్పటిలాగే స్టైలిష్ లుక్‌తో కనిపించనుండగా, ఎన్టీఆర్ ఇందులో ఓ పవర్‌ఫుల్ రోల్‌లో సందడి చేయనున్నాడు. రెండు ఇండస్ట్రీల టాప్ స్టార్లు కలసి తెరపై కనిపిస్తుండడంతో ఈ సినిమాపై హైప్ మామూలుగా లేదు. ప్రేక్షకులు మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాలు, సినీ విశ్లేషకులు కూడా ఈ సినిమా ఖచ్చితంగా ఓ రికార్డ్ బ్రేకర్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు. నిర్మాణ విలువలు, స్టార్ కాస్ట్, భారీ యాక్షన్ సీక్వెన్సులు అన్నీ కలిపి ఈ చిత్ర బడ్జెట్ గణనీయంగా పెరిగింది. అందుకే వార్ 2 వరల్డ్‌వైడ్ బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సిన అవసరం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.సినిమా రూ.800 కోట్ల మార్క్‌ను దాటి పోతే మాత్రం ఇది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది.
వార్ 2కి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ నుంచి గట్టి పోటీ ఉంది. రజినీకి దక్షిణాదిలో ఉన్న మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుంటే వార్ 2 కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. రెండు సినిమాలు పెద్ద మొత్తంలో థియేటర్లను ఆక్రమించుకోవాల్సి రావడం, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ పోటీలో కూడా ప్రభావం చూపుతుంది. దీంతో వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు