టాలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో రంభ గురించి పరిచయం చేయనవసరం లేదు. అప్పట్లో కుర్రాళ్ళు ఈమె అందానికి ఫిదా అయ్యారు.. మొదట ఆ ఒక్కటి అడక్కు అనే చిత్రంతో హీరోయిన్గా మారిన రంభ తన గ్లామర్ తో యూత్ ని బాగా అట్రాక్షన్ చేసింది. ఎంతోమంది స్టార్ హీరోలతో జతకట్టిన రంభ తెలుగులోనే కాకుండా కన్నడ, భోజ్ పూరి, హిందీ, మలయాళం, బెంగాలీ వంటి భాషలలో కూడా నటించింది. అయితే ఒకసారి హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటిస్తున్న సమయంలో రంభ చేసిన పనికి సీరియస్ అయ్యారట. వాటి గురించి చూద్దాం.


ఒకానొక సమయంలో స్టార్ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన రంభ ఒకేసారి రెండు మూడు సినిమా షూటింగ్లలో పాల్గొనేది. అలా రజినీకాంత్ అరుణాచలం అనే చిత్రంలో నటించిన రంభసినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. అయితే ఈ రెండు సినిమాలకు ఓకే సారి షూటింగ్ జరిగింది.. అలా అరుణాచలం సినిమాకి ఉదయం షూటింగ్ చేస్తే.. బాలీవుడ్లో నటిస్తున్న బంధన్ చిత్రానికి సంబంధించి సాయంత్రం షూటింగ్ జరిగేదట.


పైగా ఈ రెండు సినిమా షూటింగ్ లు కూడా పక్కపక్కనే జరిగేవి కావడంతో రంభకి బెనిఫిట్ అయ్యింది. అయితే ఒకసారి అరుణాచలం సినిమా షూటింగ్ సెట్లోకి సల్మాన్ ఖాన్ వచ్చారట. అలా వచ్చిన వెంటనే రంభ పరిగెత్తుకుంటూ వెళ్లి మరి హగ్ ఇచ్చి సల్మాన్ ఖాన్ ను పలకరించింది. ఈ విషయం చూసి హీరో రజనీకాంత్ అక్కడి నుంచి డైరెక్టర్ కి ఏదో చెప్పి కోపంతో వెళ్లిపోయారట. ఆ సమయంలో డైరెక్టర్ కూడా రంభ వైపు చాలా కంగారుగా చూశారని.. రజనీకాంత్ సార్ మీతో అసలు సినిమా చేయానని చెప్పేస్తున్నారని చెప్పడంతో రంభకి ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా ఏడ్చేసిందట. ఈ విషయం చూసిన రజినీకాంత్ నెమ్మదిగా వచ్చి ఇదంతా నిన్ను ఆట పట్టించడానికి అంటూ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నదట. అయితే ఇదంతా కూడా సినిమా షూటింగ్ సెట్లో అందరి ముందే చేయడంతో భయపడి పోయానని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: