
అయితే 69 ఏళ్లు వచ్చినా ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న చిరు తాజా డ్యాన్స్ వీడియోనే. ఓ ప్రముఖ ఛానల్ 30 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలో చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో స్టేజ్‌పై `ముగ్గురు మొనగాళ్లు` చిత్రంలోని `చామంతి పువ్వా పువ్వా` పాటకు హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో కలిసి ఎనర్జిటిక్ గా స్టెప్పులు వేశారు. పైగా స్టెప్స్‌కు తగ్గట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. `బాసు అదిరిపోయింది నీ గ్రేసు` అంటూ సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి చేతిలో `విశ్వంభర`, `మెగా 157` ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో విశ్వంభర ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 ప్రాజెక్ట్ జెట్ స్పీడ్ లో ముందు సాగుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు