ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ అవ్వకుండా సోషల్ మీడియాలో దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ట్రెండ్ అయిన మూవీ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న మూవీ అనే చెప్పాలి. సినీ స్టార్స్ ఈ సినిమా కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమాకి కమిట్ అయ్యాడు అనగానే ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బ్లాస్ట్ చేస్తుంది అని అంతా అనుకున్నారు .


దానికి తగ్గట్టే రాజమౌళి కూడా ప్రతి ఒక్క సీన్ ని ప్రతి ఒక్క విషయాన్ని చాలా కేర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక లీక్ సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది. రాజమౌళి తన సినిమా టైటిల్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడు అనేది అందరికీ తెలుసు . ఇప్పటివరకు ఆయన పెట్టిన టైటిల్స్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటాయి.  తన కాన్సెప్ట్ కి తన కథకి దగ్గరగా ఉంటాయి . కాగా మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాకి "విక్రమాచార్య" అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయించే పనిలో బిజీగా ఉన్నాడు రాజమౌళి అంటూ ఓ న్యూస్  బయటికి వచ్చింది.

 

ఈ పేరు ఆయన క్యారెక్టర్ నేమ్ అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. "విక్రమాచార్య" సినిమా చాలా చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా విక్రమాచార్యగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. కొందరు హీరో విక్రమ్ పేరు అలాగే మెగాస్టార్ చిరంజీవి సినిమాటిల్ పేరు కాపీ కొట్టి పెట్టావా..? అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది . ఈ సినిమాలో రెండవ హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు టాక్ వినిపిస్తుంది . కానీ దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: