ఈ మధ్యకాలంలో మనం ఇది బాగా గమనిస్తున్నాం.  ఒక స్టార్ హీరో సినిమాలో మరోక స్టార్ హీరో నటిస్తున్నాడు . అది మల్టీ స్టారర్ సినిమాగా కావచ్చు . లేకపోతే ఒక స్టార్ హీరో సినిమాలో ఇంకొక స్టార్ హీరో గెస్ట్ పాత్రలో కనిపించడానికి అయినా కావచ్చు . రకరకాలుగా స్టార్స్ ఈ మధ్యకాలంలో కలిసి సందడి చేస్తున్నారు . తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త మాత్రం బాగా అవిరల్ అవుతుంది. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేస్తుంది. అసలు ఇలాంటి కాంబో ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.


 పవన్ కళ్యాణ్ రీసెంట్గా నటించిన సినిమా "హరిహర వీరమల్లు" ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.  అయితే ఈ సినిమా తర్వాత అలాంటి క్రేజీ హిట్ పడాలి అంటే మాత్రం ఖచ్చితంగా "ఓజీ" సినిమా రిలీజ్ అవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ పట్టుబట్టారు . టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న  సినిమా  "ఓజీ". సెప్టెంబర్ 25వ తేదీ గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది  ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.



రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన "ఫైర్ స్ట్రోమ్" సాంగ్ రిలీజ్ అయింది . ఇది బాగా ఆకట్టుకుంటుంది.  అయితే ఓజి సినిమాలో ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఉందట.  ఆ క్యారెక్టర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించాడు అన్న న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. సుజిత్ ఇది ఒక సర్ ప్రైజింగ్ రోల్ గా అభిమానులకి చూపించాలి అని ఎటువంటి లీక్ లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడట.  కానీ సుజిత్ ఎంత జాగ్రత్త పడిన ఈ లీక్ బయట పడిపోయింది.  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రామ్ చరణ్ కూడా ఒక ఐదు నిమిషాల పాటు సందడి చేయబోతున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: